Wednesday, January 22, 2025

ప్రధాని బిబిసి డాక్యుమెంటరీ నిరోధంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోడీపై బిబిసి రూపొందించిన బిబిసి డాక్యుమెంటరీని సెన్సార్ చేయడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. మూడు వారాల్లో జవాబివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా కేసు విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

ప్రముఖ జర్నలిస్టు ఎన్. రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్ర, యాక్టివిస్ట్ లాయర్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన వినతులపై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎం.ఎం.సుందరేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు. న్యాయవాది ఎం.ఎల్. శర్మ దాఖలు చేసిన వినతిపై కూడా సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. ఉత్తర్వులకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులను కూడా సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘మేము నోటీసులను జారీచేస్తున్నాము. మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి. ఆ తర్వాత రెండు వారాలకు రీజాయిండర్’ అని ధర్మాసనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News