Friday, November 22, 2024

కర్ణాటక ముస్లిం రిజర్వేషన్ రద్దుపై సుప్రీం విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కర్ణాటకలో ముస్లింలకు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే మేనెల 9 కి వాయిదా పడింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వులు ప్రకారం మే 9 వరకు ఎలాంటి కొత్త నియామకాలు, అడ్మిషన్లు జరగబోవని కర్ణాటక ప్రభుత్వం ధర్మాసనానికి హామీ ఇచ్చింది. కర్ణాటకలో ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి లింగాయత్‌లు, వొక్కలిగాలకు 2 శాతం చొప్పున కేటాయించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Also read: 28 రాష్ట్రాలు, యుటిల్లో భూరికార్డుల్లో ఎన్‌జిడిఆర్‌ఎస్ విధానం!

దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 13న సుప్రీం కోర్టులో జస్టిస్ కెఎం జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్నధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై ప్రభుత్వ స్పందన కోరుతూ ఈనెల 25కు వాయిదా వేసింది. కొత్త రిజర్వేషన్ విధానంలో కొత్త నియామకాలు, అడ్మిషన్లు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై విచారణను మే 9 కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News