పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాయడం కలవరపెట్టేధోరణి
పాలకపార్టీ నేతల ప్రాపకం కోసం పోలీసులు దేనికైనా సిద్ధపడుతున్నారు
ఈ సంప్రదాయానికి తెరపడాలి : సిజెఐ ఎన్‌వి.రమణ
న్యూఢిల్లీ: పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కా యడం ఇబ్బందికర సంప్రదాయంగా మారిందని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స స్పెండయిన ఐపిఎస్ అధికారి గుర్జిందర్ పాల్ సిం గ్‌పై చత్తీస్‌గఢ్ ప్రభుత్వం దేశద్రోహం, తదితర కే సులు నమోదు చేసింది. ఈ కేసులను సవాలు చే స్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసన ం గురువారం విచారణ జరిపింది. సందర్భంగా పోలీసుల తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చే సింది. కేసుల నమోదులో పోలీసు శాఖ బాధ్యత వహించాలని.. వారి తీరు ఇబ్బందికర సంప్రదాయంగా మారిందని వ్యాఖ్యానించింది. ‘పోలీసు లు అధికార పార్టీకి కొమ్ముకాయడం కలవరపెట్టే ధోరణి.. ఇలాంటి సంప్రదాయానికి తెరపడాల్సిన అవసరం ఉంది. పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రేరేపి త కేసులు నమోదు అవుతున్నాయి. అధికారం మారగానే కొందరు అధికారులపై చర్యలు తీసుకొ ంటున్నారు.
అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. కొందరు పోలీసు అ ధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారు. ఐపిఎస్ గుర్జిందర్ పాల్ సి ంగ్‌ను అరెస్టు చేయవద్దు. పోలీసుల విచారణకు ఆయన సహకరించాలి. ఈ కేసులపై చత్తీస్‌గఢ్ ప్ర భుత్వం నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలి’ అని సుప్రీంకోర్టు ఆదేశించింది. చత్తీస్‌గఢ్ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా పనిచేసిన సింగ్‌పై మొదట రా ష్ట్ర ఎసిబి దాడుల అనంతరం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై కేసు నమోదు చేశారు. ఆతర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కు ట్రపన్నారనే ఆరోపణపై దేశ ద్రోహం కేసు న మోదు చేసి సస్పెండ్ చేశారు. దీనిపై సింగ్‌ఛోకోర్టును ఆశ్రించగా హైకోర్టు ఇటీవల ఆయపై దేశద్రోహం కేసును కొట్టివేయడానికి నిరాకరించింది దీంతో ఆ యన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సింగ్ తరఫున సీనియర్ న్యాయవా ది నారిమన్ వాధించగా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తరఫున మరో సీనియ ర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీ వాదించారు. ఇప్పటికే చార్జిషీట్ దాఖలయినందున ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపడమనే ప్రశ్నే ఉత్పత్తి కాదని నారిమన్ అన్నారు.
అయితే సింగ్ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నత పదవిలో ఉన్నారని, ఆయన అరెస్టును తప్పించుకుని తిరుగుతున్నారని రోహ్తగీ అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆయనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించరాదని కూడా ఆయన అన్నారు. ఈ దశలో బెంచ్ జోక్యం చేసుకుని దేశద్రోహం కేసును తాము పరిశీలిస్తామన్నారు. ‘ దేశంలో ప్రస్తుతం ఇలాంటి ధోరణి ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే ధోరణి.. దీనికి పోలీసు శాఖే బాధ్యత వహించాలి. మీ క్ల యింట్ (సింగ్) నిజాయితీగా వ్యవహరించారని చెప్పవద్దు . ఆయన అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రవర్తించి ఉం డవచ్చు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు, ‘ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానితో అంటకాగిన పోలీసు అధికారులు, ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ధోరణికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది’ అని కూడా వ్యాఖ్యానించింది.
SC protects suspended IPS officer of Chhattisgarh