Monday, December 23, 2024

‘ధరమ్ సంసద్‌’పై ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు!

- Advertisement -
- Advertisement -

Dharam Sansad

న్యూఢిల్లీ: రూర్కీలో ఆదివారం జరుగనున్న ప్రతిపాదిత ‘ధర్మ సంసద్‌’పై ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని,  సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. దీనికి సంబంధించి తీసుకుంటున్న నివారణ, దిద్దుబాటు చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి అఫిడవిట్‌ను కోరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే దానిపై ఇప్పటికే కోర్టు తీర్పులు ఉన్నాయని, రాష్ట్రానికి వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. “మీరు ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను మాత్రమే అనుసరించాలి. మీరు దానిని అనుసరిస్తున్నారా, లేదా? అనేదే మీరు మాకు చెప్పాలి”అని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా , సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. “ఇలా ఉన్నప్పటికీ, దానికి విరుద్ధంగా జరుగుతున్నట్లయితే, మీరు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి” అని  పేర్కొంది.

రాష్ట్రంలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నివారణ చర్యలు చేపట్టామని, విచారణ చేపట్టామని తెలిపారు. కాగా “విచారణ మాత్రమే కాదు. మీరు ఈ  చర్యను నిలిపివేయాలి’’ అని జస్టిస్ ఖాన్విల్కర్,  న్యాయవాదికి చెప్పారు. ఏదైనా జరిగితే అక్కడే ఉండాలని ప్రధాన కార్యదర్శిని కోరతామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇదివరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ‘ధర్మ సంసద్‌’కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కూడా కోర్టు స్వీకరించింది. దానిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్‌లో వివరించాలని ఆ రాష్ట్ర న్యాయవాదిని కోరింది. హిమాచల్ ప్రదేశ్ తరపు న్యాయవాది ‘అటువంటి సమస్యేది లేదని నిర్ధారించడానికి రాష్ట్రం పోలీసు చట్టంలోని సెక్షన్ 64 కింద హిమాచల్ ప్రభుత్వం  నోటీసు జారీ చేసిందని చెప్పారు. ప్రాతినిధ్యాన్ని స్వీకరించిన తరువాత, రాష్ట్రం చర్య తీసుకుంటుం’ అని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News