Monday, December 23, 2024

జ్ఞానవాపి మసీదులోని శివలింగం సర్వే తేదీని వాయిదా వేసిన సుప్రీంకోర్టు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత ఏడాది వీడియోగ్రాఫిక్ సర్వేలో వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో కనుగొనబడిన శివలింగానికి సంబంధించిన కార్బన్ డేటింగ్‌తో సహా ‘శాస్త్రీయ సర్వే’ ని సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. ‘శివ లింగం కార్బన్ డేటింగ్ మెరిట్ ఆధారంగా పరిశీలించడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. అయితే ఉత్తర్వులో ఉన్న చిక్కులు, ఆర్డర్‌లో సంబంధిత ఆదేశాల కారణంగా అమలు తదుపరి తేదీకి వాయిదా వేయబడింది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

సర్వే సమయంలో గత ఏడాది మే 16న మసీదు ఆవరణలో కనపడిన దానిని హిందువులు ‘శివలింగం’ అని, ముస్లింలు ‘ఫౌంటైన్’ అని వాదిస్తున్నారు. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోనే ఈ మసీదు కూడా ఉంది. శివలింగం కార్బన్ డేటింగ్, శాస్త్రీయ సర్వే కోసం పెట్టుకున్న దరఖాస్తును 2022 అక్టోబర్ 14న వారణాసి జిల్లా న్యాయమూర్తి తిరస్కరించిన ఆదేశాలను మే 12న హైకోర్టు పక్కన పెట్టింది. ‘శివలింగం’ పై శాస్త్రీయ పరిశోధన జరపాలని హిందూ ఆరాధకులు పెట్టుకున్న దరఖాస్తుపై చట్ట ప్రకారం కొనసాగాలని వారణాసి జిల్లా న్యాయమూర్తిని హైకోర్టు ఆదేశించింది. కింది కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్లు లక్ష్మీదేవి, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News