కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకం “పూర్తిగా పారదర్శకంగా ఉంది” అని కేంద్రం పదేపదే చెబుతున్నప్పటికీ, రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడానికి డబ్బు పంపింగ్ చేయబడిన మూలాన్ని ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ వెల్లడిస్తుందా అని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. “ఇది పారదర్శకంగా ఉందా? డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?” అంటూ జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. “డబ్బును స్వీకరించే పద్దతి పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది… నల్ల లేదా లెక్కలో లేని డబ్బును పొందడం అసాధ్యం… ఇది (ఎలక్టోరల్ బాండ్ల పథకం) ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పడానికి దాఖలాలు ఉండకపోవచ్చు. కానీ మేము ఈ దశల వారీగా దీనిని ముందుకు తీసుకెళతాం” అని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు జవాబిచ్చారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలన్న ఎన్నికల ప్రక్రియను ఈ పథకం ప్రభావితం చేసిందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. “ప్రతి రాష్ట్ర ఎన్నికలకు ముందు వారు ఎలక్టోరల్ బాండ్లను జారీ చేస్తున్నారు” అని పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకున్నారు. “ఈ రోజు వారు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల తేదీలను ప్రకటించబోతున్నారు” అని శ్రీ భూషణ్ స్పందించారు. ‘‘ ఎవరు ఎవరికి నిధులు సమకూరుస్తున్నారో కూడా తెలియదు. ఆర్టికల్ 324 భావననే అది నాశనం చేస్తుంది. దీనిని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలి’’ అని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. చివరకు కోర్టు విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.