కలకత్తా హైకోర్టుకు ఆరుగురు శాశ్వత జడ్జీలు
కేంద్రానికి ఆరుగురి పేర్లు కొలిజియమ్ సిఫార్సు
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టుకు ఆరుగురు శాశ్వత జడ్జీల నియామకం కోసం కేంద్రానికి ఆరుగురి అడిషనల్ జడ్జీల పేర్లను కొలిజియమ్ సిఫార్సు చేసింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియమ్ ఏప్రిల్ 19న సమావేశమై ఆరుగురి పేర్లను ప్రతిపాదిస్తూ ఆమోదించింది. సీనియర్ జడ్జీలు యుయు లలిత్, ఎఎం ఖాన్‌విల్కర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా ఉన్న జస్టిస్ సత్యేన్ వైద్యను అదే కోర్టు శాశ్వత జడ్జిగా ప్రతిపాదిస్తూ ఆమోదించారు. ఈ సిఫార్సులను కేంద్రం ఆమోదించితే మహిళా జడ్జి కెసాంగ్ డొమా భూటియా, మరో ఐదుగురు అడిషనల్ జడ్జిలు జస్టిస్ రవీంద్రనాధ్ సమంత, జస్టిస్ సుగతో మజుందార్, జస్టిస్ బివాస్ పట్నాయక్, జస్టిస్ ఆనందకుమార్ ముఖర్జీ, శాశ్వత జడ్జీలవుతారు.
SC Recommends 6 Permanent Judges to Kolkata HC