Thursday, January 23, 2025

ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఢిల్లీ ఆర్డినెన్సు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సివిల్ సర్వీసెస్ అధికారులపై పెత్తనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సును సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు గురువారం నివేదించింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలన్న సుప్రీంకోర్టు అభిప్రాయంపై సోమవారం ఢిల్లీ ప్రభుత్వం అభ్యంతరం తెలియచేయడంతో తన నిర్ణయాన్ని గురువారం వరకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News