Thursday, January 23, 2025

స్వలింగ వివాహ పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనానికి!

- Advertisement -
- Advertisement -
కోర్టు ఏప్రిల్ 18న కేసుల బ్యాచ్ విచారణను ప్రారంభించనుంది!

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధంగా ధ్రువీకరించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు మార్చి 13న(నేడు) ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి పంపింది. ఏప్రిల్ 18న ఈ కేసుల విచారణను కోర్టు ప్రారంభించనుంది.

భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 13న పిటిషన్లు దాఖలు చేసిన వివిధ పక్షాల తరుఫు న్యాయవాదుల న్యాయపరమైన ప్రతిపాదనలను విన్న తర్వాత ఈ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార మెహతా స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించడం పార్లమెంటు విధి అని, అనేక అంశాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.

స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన ధృవీకరణను కోరుతూ వచ్చిన అభ్యర్థులను వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌లో, జీవించడానికి, స్వేచ్ఛకు ప్రాథమిక హక్కు స్వలింగ వివాహానికి ఎలాంటి అవ్యక్త ఆమోదాన్ని కలిగి ఉండదని ప్రభుత్వం పేర్కొంది.
‘ ఈ ఇతర రకాల వివాహాలు లేదా యూనియన్‌లను లేదా సమాజంలో వ్యక్తుల మధ్య సంబంధాలపై వ్యక్తిగత అవగాహనలను ప్రభుత్వం గుర్తించదు, కానీ అదే చట్టవిరుద్ధం కాదు’ అని పేర్కొంది.

2018లో సుప్రీంకోర్టు తీర్పు తెలిపిందేమిటంటే,  ఒకే లింగానికి చెందిన వ్యక్తులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 ప్రకారం (నేరపూరిత బాధ్యత వహించకుండా) ఏకాభిప్రాయంతో లైంగిక సంపర్కంలో పాల్గొనవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News