Wednesday, January 22, 2025

నీట్ పిజి సీట్ల భర్తీ కుదరదు

- Advertisement -
- Advertisement -

SC refuses additional counselling round for NEET-PG 2021

పిటిషన్లను కొట్టేసిన సుప్రీం

న్యూఢిల్లీ : నీట్ పిజి 2021 సీట్లపై అదనపు కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండదని, మిగిలిన సీట్ల భర్తీకి వీలులేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. భారీ స్థాయిలో 1456 పిజి సీట్లుఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసేందుకు నీట్ పిజి 2021 ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని అప్పటి పరీక్షలో అర్హత దక్కించుకున్న డాక్టర్ల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తదుపరి కౌన్సెలింగ్‌కు అవకాశం లేదని తీర్పు వెలువరించింది. ప్రజారోగ్యం, వైద్య విద్యావ్యవస్థల ప్రయోజనాల కోణంలో కౌన్సెలింగ్ మరో దఫా నిర్వహించాలనే పిటిషన్లను కొట్టివేస్తున్నామని ధర్మాసనం తెలిపింది.అస్థా గోయల్ సారధ్యంలో ఏడుగురు డాక్టర్ల బృందం తిరిగి ప్రవేశాలకు అవకాశం ఉండాలని, ఖాళీ సీట్ల భర్తీ జరగాలని పిటిషన్‌లో తెలిపారు. అయితే మిగిలిన సీట్ల భర్తీ ప్రక్రియ ఇప్పుడు చేపడితే దీని ప్రభావం విద్యాసంవత్సరంపై పడుతుందని కేంద్రం ఇచ్చుకున్న వివరణ సరైనదే అని పేర్కొంటూ, దీనితో ఏకీభవిస్తున్నామని పేర్కొంటూ పిటిషన్లను న్యాయమూర్తులు ఎంఆర్ షా, అనిరుద్ధ్ బోస్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. 1456 పిజి సీట్లు ఖాళీగా ఉండటాన్ని ఇంతకు ముందటి విచారణల దశలో సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ఇది చాలా అనుచితం అని పేర్కొంటూ దీనిపై వివరణకు ఆదేశించింది. తరువాత కేంద్రం నుంచి వచ్చిన స్పందనను పరిశీలించుకుని ఇప్పుడు తాజా ఉత్వర్వులు వెలువరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News