Saturday, November 23, 2024

ప్రధాని డిగ్రీ వ్యాజ్యం.. కేజ్రీవాల్‌కు దక్కని సుప్రీం ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి డిగ్రీపై వ్యాఖ్యల వివాదంలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి చుక్కెదురైంది. ప్రధాని విద్యార్హతల డిగ్రీని కించపరుస్తూ కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్‌లు గతంలో చేసిన వెటకారపు వ్యాఖ్యలు వారిని కోర్టుకు లాగాయి. వీరిపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం దావా కేసు పై స్టే ఇవ్వాలనే అప్పీలును గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిని సవాలు చేసే పిటిషన్ విచారణకు స్వీకరించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు శుక్రవారం దీనిని తిరస్కరించింది. దీనితో కేజ్రీవాల్‌పై ఇప్పుడు పరువు నష్టం దావా విచారణ జరిగేందుకు రంగం సిద్ధం అయింది. దీని ఫలితంగా ఆయన తరువాత క్రిమినల్ చర్యలకు కూడా గురి కావల్సి ఉంటుంది.

సంబంధిత కేసు ఇప్పటికీ గుజరాత్ హైకోర్టు పరిధిలోనే ఉందని, పైగా ఈ నెల 29న ఇది విచారణకు రానుందని, ఈ దశలో తాము క్లయింట్ అప్పీలును స్వీకరించడం కుదరదని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్‌విఎన్ భట్టితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిర్యాదీలు తమ సమస్య ఏదైనా సంబంధిత హైకోర్టుకు తెలియచేసుకోవచ్చునని, దీనిపై గుజరాత్ యూనివర్శిటీ కూడా హైకోర్టునే ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. గుజరాత్ యూనివర్శిటీ నుంచి మోడీ డిగ్రీ పట్టా పొందారని చెపుతున్నారని, ఈ పట్టా వివరాలు తమకు అందించాలని ఆప్ నేత ఆర్టీఐ యాక్ట్ పరిధిలో కేజ్రీవాల్ అభ్యర్థించగా , వివరాల సమర్పణకు చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ వర్శిటీ అధికారులను ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను గుజరాత్ హైకోర్టు నిలిపివేసింది. ఈ దశలోనే కేజ్రీవాల్ , సంజయ్ సింగ్‌లు చేసిన వ్యాఖ్యలు ప్రధానిని డిగ్రీ కోణంలో కించపర్చేవిగా ఉన్నాయనే విషయం కోర్టులో విచారణకు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News