Sunday, December 22, 2024

ఆదిపురుష్ రూపకర్తలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రభాస్ కథనాయకుడిగా నటించిన ఆదిపురుష్ చిత్ర రూపకర్తలకు సుప్రీంకోర్టులో బుధవారం చుక్కెదురైంది. జులై 27వ తేదీన కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తూ వివాదాస్పద చిత్రం ఆదిపురుష్ నిర్మాత, దర్శకుడు, మాటల రచయితకు అలహాబాద్ హైకోర్టు జారీచేసిన సమన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.  గురువారం ఈ అంశాన్ని ప్రస్తావించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల తరఫు న్యాయవాదికి సూచించింది.

ఆదిపురుష్ చిత్రంపై దాఖలైన పిటిషన్లపై జులై 30న ఉత్తర్వులు జారీచేసిన అలహాబాద్ హైకోర్టు చిత్ర దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్, మాటల రచయిత మనోజ్ ముంతషీర్ జులై 27న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అంతేగాక ప్రజల మనోభావాలు ఈ చిత్ర వల్ల దెబ్బతిన్నాయా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ చిత్రానికి జారీచేసిన సర్టిఫికెట్ విషయాన్ని సమీక్షించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అల్పమైన భాషతో కూడిన సంభాషణలతో రామాయణ గ్రంథాన్ని వక్రీకరిస్తూ నిర్మించిన ఆదిపురుష్ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ కుల్దీప్ తివారీ, నవీన్ ధావన్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News