Thursday, January 23, 2025

ఇడి, సిబిఐపై సుప్రీంలో 14 పార్టీల పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఇడిలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ 14 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. రాజకీయ నాయకలకు ప్రత్యేక రాయితీలేవీ లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దాదాపు 30 నిమిషాల సేపు పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఎఎం సింఘ్వి తాను పిటిషన్‌ను ఉపసంహరించుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో సిజెఐ డివై చంద్రచూడ్ నతృత్వంలోని ధర్మాసనం దీన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.

అంతకుముందు..పిటిషనర్లు కాంగ్రెస్, డిఎంకె, ఆర్‌జెడి, బిఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఎన్‌సిపి, శివసేన(యుబిటి), జెఎంఎం, జెడి(యు), సిపిఎం, సిపిఐ, సమాజ్‌వాది పార్టీ, జెకె నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున న్యాయవాది సింఘ్వి వాదిస్తూ గత రాష్ట్ర, యుటి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీన్నిటికీ కలిపి 45.19 శాతం ఓట్లు లభించాయని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 42.5 శాతం ఓట్లు లభించాయని తెలిపారు. 11 రాష్ట్రాలు, యుటిలలో అధికారంలో ఉన్నామని ఆ పార్టీల తరఫున ఆయన చెప్పారు.

సిబిఐ, ఇడి కేసులలో 95 శాతం ప్రతిపక్ష పార్టీల నాయకులపైనే ఉన్నాయని ఆయన తెలిపారు. అరెస్టు, రిమాండు బెయిల్‌కు సంబంధించి దర్యాప్తు సంస్థలు, కోర్టులు పాటించాల్సిన మార్గదర్శకాలను జారీచేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అయితే ప్రస్తుత దర్యాప్తులకు విఘాతం కల్పించడానికి తాము ప్రయత్నించడం లేదని ఆయన వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News