Wednesday, January 22, 2025

స్వలింగ సంపర్కుల వివాహాలకు సుప్రీం రెడ్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు సుప్రీంకోర్టు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని, 3-2 మెజార్టీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. వివాహం ప్రాథమిక హక్కు కాదని, స్వలింగ జంటల అభ్యర్థనపై సానుభూతి ఉందని కానీ చట్టబద్ధత లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కలిసి జీవించొచ్చని కానీ దంపతులుగా గుర్తించలేమని వెల్లడించింది. ప్రత్యేక వివాహ చట్టంపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని సిజెఐ పేర్కొంది. స్వలింగ సంపర్కులు బిడ్డలను దత్తత తీసుకోవచ్చని సూచించింది. ఎల్‌జిబిటిక్యు కమ్యూనిటీకి కలిసి జీవించే హక్కు ఉందని పేర్కొంది. వివాహ హక్కుల నిర్థారణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని, జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ప్రత్యేక వివాహ చట్టాన్ని మార్పు చేయలేమని వెల్లడించింది. ప్రత్యేక వివాహ చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదని వివరణ ఇచ్చింది.

Also Read: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత… రేవంత్ అరెస్టు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News