Thursday, January 23, 2025

బిహార్ ప్రభుత్వ కులాల సర్వే పాట్నా హైకోర్టు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులాల సర్వే నిలిపివేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ కేసుపై తదుపరి విచారణ జులై 14న చేపడతామని ధర్మాసనం గురువారం వెల్లడించింది. పాట్నా హైకోర్టు ప్రస్తుత చీఫ్ జస్టిస్ కె.వి. చంద్రన్ నేతృత్వం లోని ద్విసభ్య ధర్మాసనం మే 4న బీహార్ ప్రభుత్వ కులాల సర్వే నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కులాల వారీగా సర్వే చేపట్టడానికి బీహార్ ప్రభుత్వానికి రాజ్యాంగపరంగా ఎలాంటి అధికారం లేదని పాట్నా హైకోర్టు ఉత్తర్వులో పేర్కొంది.

Also Read: జనసేనకు రూ.కోటి విరాళం

అంతకు ముందు ఈ కేసు రెండుసార్లు సుప్రీం కోర్టు ముందుకు రాగా, పాట్నా హైకోర్టుకు అది బదిలీ అయింది. గురువారం దీనిపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ రాజేష్ బిందాల్ సర్వే పేరున జనాభా లెక్కల సేకరణా కాదా అన్నది పరిశీలిస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియ జనాభా లెక్కల సేకరణ అని అనేక సాక్షాధార పత్రాల ద్వారా తెలుస్తోందని జస్టిస్ బిందాల్ పేర్కొన్నారు. పాట్నాహైకోర్టు ఈ కేసులో ప్రధాన పిటిషన్‌పై జులై 3న విచారణ చేపట్టనున్నదని, అప్పటికి విచారణ ప్రారంభం కాకుంటే జులై 14న విచారణ చేపట్టడానికి ఆదేశిస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News