Friday, December 20, 2024

నీట్ రద్దు కోరుతూ సంతకాల ఉద్యమం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :దేశంలో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు అర్హత పొందడానికి నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. ఈ సంతకాల ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు మంగళవారం నిరాకరించింది. స్కూళ్లలో ఈ సంతకాల ఉద్యమం సాగకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. తప్పనిసరిగా పిల్లలు ఈ పరీక్షకు హాజరవుతున్నప్పటికీ, వారు నిరాశానిస్పృహలకు గురవుతారని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కెవి విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం దీనిపై స్పందిస్తూ ఇప్పటితరం మనకంటే చాలా ముందుందని, మన పిల్లలు అసలేం తెలియని వాళ్లు కాదని, ఏది కేవలం నినాదం, ఏది ఎజెండా, ఎలా ఇది ఏర్పడింది అన్నది ప్రతీదీ అర్థం చేసుకుంటారని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. గత ఏడాది అక్టోబర్‌లో పాలక డిఎంకె తమిళనాడులో నీట్ రద్దు కోరుతూ సంతకాల ఉద్యమం చేపట్టింది 50 రోజుల్లో 50 లక్షల సంతకాలను సేకరించాలని లక్షంగా పెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News