Thursday, January 23, 2025

వందేభారత్ రైలు స్జేజ్ పిటిషనర్‌పై సుప్రీం చురక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వందేభారత్ రైలు ఏ స్టేషన్‌లో ఆపాలనేదే మమ్మల్ని చెప్పమంటారా? ఏమిటీ ఈ పిటిషన్ తంతు అని సుప్రీంకోర్టు ఓ వ్యక్తిని మందలించింది. ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయడానికి ఇదేమైనా పోస్టు ఆఫీసు అనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. కేరళకు చెందిన 39 ఏండ్ల లాయర్ పిటి షీజిష్ తమ స్వస్థలంలో వందేభారత్ ఆపేలా చూడాల్సి ఉందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, పిఎస్ నరసింహ , మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. దీనిని మీరు పోస్టాఫిసు అనుకుంటున్నట్లుగా ఉంది,

మమ్మల్ని స్టేషను మాస్టర్లుగా భావిస్తున్నారా? వందేభారత్ రైలు నిలిపే విషయంలో మేమేమి చేస్తామని ప్రశ్నించారు. ఢిల్లీ ముంబై రాజధాని స్టాప్‌ను ఖరారు చేయాలా? దీనికి సంబంధించి విధి విధానాలు ఉంటాయి. సంంధిత అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోండని చురకలు పెట్టారు. లాయర్ ఎంచుకున్న స్టేజ్‌లో రైలు ఆగాలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని కానీ , రైలు ఆపే విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదన్నారు. పైగా ఏర్నాకులంలోని కేరళ హైకోర్టు వారు ఇప్పటికే ఈ పిటిషన్‌ను తోసిపుచ్చారని , దీనిపై సుప్రీంకోర్టుకు రావడం అనుచితం అని ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News