- Advertisement -
కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
న్యూఢిల్లీ: జిల్లాలు, రాష్ట్ర వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్లలో నియామకాలలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రిబ్యునళ్లు అవసరం లేదనుకుంటే కేంద్రం సంబంధిత చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ట్రిబ్యునళ్లలో ఖాళీల భర్తీలను సుప్రీంకోర్టు పరిశీలించే పరిస్థితి రావడం దురదృష్టకరమని జస్టిస్ ఎస్‌కె కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా జిల్లాలు, రాష్ట్ర వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్లలోని అధ్యక్షుడు, సభ్యులు, సిబ్బంది నియామకాలలో జరుగుతున్న జాప్యం, అరకొర మౌలిక సౌకర్యాలపై సుప్రీంకోర్టు సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎనిమిది వారాల్లోగా ఖాళీలు భర్తీ చేయాలని ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ అవి అమలు కాలేదు.
- Advertisement -