Wednesday, January 22, 2025

కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్… పెద్ద నోట్ల రద్దు ప్రక్రియపై విచారణ

- Advertisement -
- Advertisement -

SC Says it will examine demonetisation exercise

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు కోసం నరేంద్ర మోడీ నేతృతం లోని కేంద్ర ప్రభుత్వం చేసిన కసరత్తుపై సుప్రీం కోర్టు విచారణ జరపబోతోంది. రూ.500,రూ.1000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై నవంబర్ 9 న విచారణ జరుపుతామని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు చేయడానికి నిర్ణయం తీసుకునేందుకు చేసిన కసరత్తుకు సంబంధించిన అన్ని వివరాలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని , భారతీయ రిజర్వుబ్యాంకును సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. ఈ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం నవంబరు 9న విచారణ జరుపుతుందని తెలిపింది. 2016 నవంబరు 8 న పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన తరువాత వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. వీటిపై సెప్టెంబర్ 28న విచారణ జరిగింది.

అటార్నీ జనరల్ ఆఫ్ వేంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ అంశం విద్యా సంబంధిత అంశంగా మారిందని, పెద్ద నోట్ల రద్దు చేసి ఆరేళ్లు గడిచి పోయాయని అన్నారు. వెంటనే సీనియర్ అడ్వకేట్లు పి. చిదంబరం, శ్యామ్ దివాన్ పిటిసనర్ల తరఫున వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటుపై సవాలు చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ సమస్య భవిష్యత్తుకు కూడా సంబంధించినదని పేర్కొన్నారు. దాఖలైన 58 పిటిషన్లపై జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ బీవీ నాగరత్న రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News