Monday, December 23, 2024

చెప్పాల్సింది చాలా ఉంది కానీ..

- Advertisement -
- Advertisement -

జడ్జీల బదిలీలు, నియామకాల సిఫార్సుల ఆమోదంలో
కేంద్రం జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్య

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను ఆమోదించి నోటిఫై చేయడంలో కేంద్రప్రభుత్వం చేస్తున్న జాప్యంపై దాఖలయిన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజయ్ విషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన బెంచ్ ఈ అంశంపై చెప్పాల్సింది చాలా ఉంది కానీ .. ప్రభుత్వం మరికొంత సమయం కోరినందున ఎక్కువ మాట్లాడడం లేదని వ్యాఖ్యానించింది. 2022 నవంబర్‌నుంచి దాదాపు 70 పేర్లు హైకోర్టులు పంపించాయని, అయితే అవి తమకు చేరలేదని జస్ట్టిస్ కౌల్ ందోళన వ్యక్తం చేశారు ‘ ఖాళీలు పెద్ద అంశం కాబట్టి నేను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాను.

గత ఏడు నెలలుగా ఏ ఒక్క పేరు కూడా మాకు చేరలేదు. సిఫార్సులు చేయడం జరిగింది కానీ వారి నియామకం జరగలేదు’ అని కౌల్ అన్నారు. ఓ సున్నితమైన హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సహా అత్యంత ముఖ్యమైన నియామకాలు సైతం పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ కౌల్ అన్నారు. తన వద్ద మొత్తం గణాంకాలున్నాయని ఆయన అంటూ, తాను ఈ కేసును రెగ్యులర్‌గా పరిశీలిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

దీనిపై తాను చాలా చెప్పాలని అనుకున్నానని కానీ అటార్నీ జనరల్ వారం రోజులు సమయం అడిగినందున ఎక్కువ మాట్లాడడం లేదని కూడా ఆయన అన్నారు. కాగా నియామకాలు ఆలస్యం అవుతున్న కారణంగా అభ్యర్థులు తమ పేర్లను ఉపసంహరించుకుంటున్నారని విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నిరంతరాయంగా కొనసాగరాదని ఆయన అన్నారు. కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఓ దశలో సూచించారు. అయితే తాను ఈ విషయాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉంటానని చెప్పిన జస్టిస్ కౌల్ తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News