న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు సోమవారం పక్కనబెట్టింది. వారంలోగా లొంగిపోవలసిందిగా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి. రమణ, న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ఆశిష్‌ను ఆదేశించింది. బాధిత కుటుంబాలను విచారించిన తర్వాత మిశ్రాకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు దానిని తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపింది.
గత ఏడాది అక్టోబర్ 3న ఆశిష్ మిశ్రా తన తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన థార్ కారుతో సహా మూడు ఎస్‌యూవిల కాన్వాయ్‌తో లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతుల మీదికి పోనిచ్చాడు. అప్పుడు నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన హింసాకాండలో ఇద్దరు బిజెపి కార్యకర్తలు, థార్ వాహనం డ్రైవర్ చనిపోయారు.
ఆశిష్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించినప్పుడు తమ వాదన వినిపించుకోలేదని కొందరు బాధిత బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వర్చువల్‌గా జరిగిన విచారణలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వారు తెలిపారు. పిటిషనర్లు మళ్లీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తమ వాదనను వినిపించే అవకాశం నిరాకరించబడింది.
ఆశిష్ మిశ్రా బెయిల్‌కు బ్రేక్!
- Advertisement -
- Advertisement -
- Advertisement -