- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎస్సీలలో 57 ఉపకులాల వారికి దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయనను కలిసి ఎస్‌సి ఉప కులాల ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మోచీ, రెళ్లి, సింధు, డక్కలి, బుడగజంగాలు, ముష్టి, మంగ కులాలకు సంక్షేమ ఫలితాలు అందడం లేదని ఈటల అన్నారు. కనీసం ఉండటానికి ఇల్లు లేదని, విద్యకు నోచుకోవడం లేదని వాపోయారు. హుజురాబాద్ లో 17,700 కుటుంబాలుంటే ఇప్పటికీ 14 వేల కుటుంబాలకు పూర్తిస్థాయిలో దళితబంధు అందలేదన్నారు. జీవితాంతం కొట్లాడుతున్నా వారి బ్రతుకులు మారలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఊహించుకున్నాం… కానీ పెనం మీద నుంచి పోయిలో పడ్డాం తప్ప ఒరిగింది ఏమీ లేదన్నారు.
- Advertisement -