Friday, December 20, 2024

ఎస్‌సి అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీ విజయ్‌కుమార్ పదవీ విరమణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎస్‌సి అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ పదవి విరమణ పొందారు. బుధవారం అంబేద్కర్ సచివాలయం లో విజయ్ కుమార్ ను రాష్ట్ర ఎస్‌సి అభివృద్ధి శాఖ ఉద్యోగులు, సిబ్బంది, మంత్రి కొప్పుల ఈశ్వర్ పేషి సిబ్బంది, తెలంగాణ సచివాలయం ఉద్యోగ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. విజయ్ కుమార్ ఎస్‌సి అభివృద్ధి శాఖాలో ఉన్నత పదవిలో ఉన్నంత కాలం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు చేసిన సేవలు ఎప్పటికి మర్చి పోలేమని ఈ సందర్భంగా సిబ్బంది కొనియాడారు.

ఆయన పదవి విరమణ చేసినప్పటికి సూచనలు, సలహాలు తీసుకుంటామని చెప్పారు. తాను పదవి విరమణ పొందినప్పటికి ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ కార్యక్రమాల్లో తనవంతు భాగస్వామిగా పాలు పంచుకుంటానని విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, అదనపు కార్యదర్శి ఉమాదేవీ, మంత్రి కొప్పుల ఈశ్వర్ పి.ఎస్.రాజేశ్వర్, పర్సనల్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ ఎస్‌సి అభివృద్ధి శాఖా సిబ్బంది, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News