Wednesday, January 22, 2025

రాహుల్ గాంధీకి ఊరట: జైలు శిక్షపై సుప్రీం స్టే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మోడీ ఇంటిపేరు కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి విధించిన రెండే ళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది.

సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేయడంతో దీన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి విధించిన శిక్షను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News