Wednesday, January 22, 2025

జగిత్యాలలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు శిక్షణ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

 

జగిత్యాల: ముఖ్యమంత్రి త్వరితగతి నిర్ణయాల వల్లనే నేడు రాష్ట్రంలో స్టడీ సర్కిల్ ల ఏర్పాటు చేసామనిరాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ 5 నెలల ఫౌండేషన్ కోర్సు శిక్షణ (రెండవ బ్యాచ్)ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఉండేదని అందులో 200 సీట్ల కు పోటీ పడుతుంటే తెలంగాణకు 15 శాతం, ఆంధ్ర ప్రాంతానికి 85 శాతం ఉండేది, తెలంగాణ ప్రాంతం చాలా తక్కువ కేటాయింపు జరుగుతుండేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత జిల్లాకు ఒకటి రెండు చొప్పున స్టడీ సర్కిల్ లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కిందాన్నారు.

రాష్టంలోని 33 జిల్లాలు ఉంటే 33 స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయటం జరిగిందని, ఇవే కాకుండా త్వరలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ స్టడీ సర్కిల్ సైతం ఏర్పాటు చేయబోతున్నారని మంత్రి కొప్పుల చెప్పారు.  విద్యార్థులు ఈ స్టడీ సర్కిల్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవడం వల్లనే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ను, విద్యార్థులను చూసి ప్రేరణ పొందాలన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్టడీ సర్కిల్ లు సమూల మార్పులు వచ్చాయన్నారు రాష్ట్ర ఏర్పడి నూతన జిల్లాలు ఏర్పాటు చేయటం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1లక్ష 32 వేల ఉద్యోగాల భర్తీ, నూతనంగా 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు.

33 జిల్లాలకు మెడికల్ కాలేజీ ల కేటాయింపు, 965 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు ఇలా అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టడం జరిగిందన్నారు మంత్రి. అలాగే జగిత్యాల స్టడీ సర్కిల్ మొదటి బ్యాచ్ లో వివిధ పోటీ పరీక్షల కు 463 మంది కోచింగ్ తీసుకోగా వారిలో 130 మంది ప్రిలిమినరీ అర్హత సాధించారు. వారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా జ‌డ్పీ ఛైర్మెన్ దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్, ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

SC Study Circle Foundation Course Training in Jagtial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News