Monday, December 23, 2024

ఓటుకు నోటు కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఓ టుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు ట్రయల్‌ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చే సిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఓటుకు నోటు కేసు ను విచారించే ఎసిబి ముఖ్యమంత్రి పరిధిలో ఉందని పి టిషనర్ (జగదీశ్ రెడ్డి) కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జగదీశ్ రెడ్డి దాఖ లు చేసిన బదిలీ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సు ప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణను ముగించింది. ట్రయల్ జరి గే విషయంపై అనుమానాలు వ్య క్తం చేస్తున్నందున స్పెషల్ ప్రాసిక్యూటర్‌ని నియమిస్తామని ధర్మాసనం పేర్కొంది. ‘మా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం’ అని జస్టిస్ గవాయ్ అన్నారు.

పిటిషన్ కొట్టివేత..
పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘మా న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం’ అని జస్టిస్ గవాయ్ తెలిపారు. తెలంగాణకు చెందిన తమ సహచరులను సంప్రదించి ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని జస్టిస్ గవాయి వెల్లడించారు. పిటిషన్ పై విచారణను త్రిసభ్య ధర్మాసనం ముగించింది. స్పెషల్ ప్రాసిక్యూటర్‌ని సుప్రీంకోర్టు నియమిస్తుందని ధర్మాసనం వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News