న్యూఢిల్లీ: ఎలెక్టొరల్ బాండ్ల స్కీమ్ ను పరిశోధించేందుకు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. ఎన్జీవో కామన్ కాజ్ ఈ పిల్ ను దాఖలు చేసింది. రాజకీయ పార్టీలు, కార్పొరేషన్లు, పరిశోధన సంస్థలు నాకిది, నీకది(క్విడ్ ప్రొ క్యూ) లెక్కన కుమ్మకయ్యారని పేర్కొంది. కోర్టు నేతృత్వంలో సిట్ పరిశోధనకు అంగీకారం లభించింది.
ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, న్యాయమూర్తులు జెపి పార్దివాలా, మనో మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్జీవోల తరఫున హాజరైన లాయర్ ప్రశాంత్ భూషణ్ నోట్ ను పరిశీలించింది. డొల్ల కంపెనీలు(షెల్ కంపెనీస్), నష్టాల్లో ఉన్న కంపెనీలు ఫండింగ్ చేసిన తీరును పరిశోధించాలని న్యాయవాది కోర్టును కోరారు. ఎలెక్టొరల్ బాండ్స్ స్కీమ్ను 2018 జనవరి 2న ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ పార్టీల డొనేషన్లలో పారదర్శకత తెచ్చేందుకు దీనిని తెచ్చారు. కానీ అదెంత మేరకనేది తేలాల్సి ఉంది.