Sunday, January 19, 2025

తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌పై సెప్టెంబర్ 1న విచారణ

- Advertisement -
- Advertisement -

Teesta Setalvad

న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల కేసుల్లో ‘అమాయకులను’ ఇరికించేందుకు కల్పిత సాక్ష్యాధారాలు సృష్టించారని ఆరోపిస్తూ అరెస్టయిన ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణకు స్వీకరించాల్సిన ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్, న్యాయమూర్తులు ఎస్ రవీంద్ర భట్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం సమయాభావం కారణంగా సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.‘సమయాభావం వల్ల ఆ విషయం పట్టాలెక్కలేదు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ అంశాన్ని లిస్ట్ చేయండి’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

గుజరాత్ ప్రభుత్వం  ఒక సీనియర్ రాజకీయ నాయకుడి ఆదేశాల మేరకు కార్యకర్త ఇతర నిందితులతో కలిసి కుట్రను చేశారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, ఒక అఫిడవిట్‌లో, సెతల్వాద్ పేర్కొన్న రాజకీయ నాయకుడితో సమావేశాలు నిర్వహించారని ,  “పెద్ద మొత్తంలో డబ్బు” పొందారని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News