Monday, December 23, 2024

13న బిల్కిస్ బానో పిటిషన్ పై విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2002 అల్లర్ల సమయంలో తనను బలాత్కరించి, తన కుటుంబ సభ్యులను హత్య చేసిన 11 మంది దోషులను ముందస్తుగానే విడిచిపెట్టడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో పెట్టుకున్న దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 13న విచారించనున్నది. సుప్రీంకోర్టు మే ఉత్తర్వుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది దీనిని విచారించేందుకు తేదీని ఖరారు చేశారు. నేరంలో బాధితురాలైన బిల్కిస్ బానో తన వినతిలో నేరస్తులను ముందస్తుగానే విడుదలచేసే ‘రెమిషన్ ప్రాసెస్’ ఉందన్న సంగతి తనకు తెలియదని పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ ఉత్తర్వు చాలా యాంత్రికంగా ఉందని, చట్టం విధించిన అన్ని నియమాలను ఉల్లంఘించిందని తన వినతిలో ఆమె పేర్కొన్నారు.

11 మంది దోషులకిచ్చిన ఉపశమన ఉత్తర్వును కొట్టేస్తూ ఆదేశాలివ్వాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో సహా ఇతరుల అనేక మంది పిల్స్ దాఖలు చేశారు. అలా పిల్స్ దాఖలు చేసిన వారిలో భారతీయ మహిళల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రజా, సిపిఐ(మార్కిస్ట్) సభ్యురాలు సుభాషిణి అలీ, జర్నలిస్ట్ రేవతి లౌల్, సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ, టిఎంసి ఎంపీ మహువా మొయిత్ర తదితరులు ఉన్నారు.

గుజరాత్ ప్రభుత్వం 2022 ఆగస్టు 10న పదకొండు మంది దోషులకు ఉపశమనం(రెమిషన్) కల్పించింది. వారిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. 1992 పాలసీ మేరకు ఉపశమన ఉత్తర్వు(రెమిషన్ ఆర్డర్)ను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది.

గుజరాత్ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో ఉపశమన వెసలుబాటును సమర్థించుకుంది. దోషులు 14 ఏళ్లు కారాగార శిక్షను పూర్తి చేశాకే వారికి ఉపశమనం ఇచ్చామని వాదించింది. కారాగారంలో వారి ప్రవర్తన కూడా మంచిగానే ఉండిందని పేర్కొంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఖైదీలకు ఇచ్చే క్షమాభిక్ష సర్కూలర్ కింద వారికి ఈ ఉపశమనం ఇవ్వలేదని కూడా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News