- Advertisement -
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మే 31న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. జస్టిస్ ఎఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు రాగా సిబిఎస్‌ఇ తరఫు న్యాయవాదికి పిటిషన్ ప్రతిని అందచేయాలని పిటిషనర్ మమతా శర్మను ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం, సిబిఎస్‌ఇ, కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్‌లను ప్రతివాదులుగా పిటిషనర్ తన పిటిషన్‌లో చేర్చారు. వీరందరికీ పిటిషన్ ప్రతులను అందచేయాలని ధర్మాసనం పిటిషనర్‌ను ఆదేశించింది. వచ్చే సోమవారం(మే 31) ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.
- Advertisement -