Monday, December 23, 2024

సుప్రీంలో క్యాష్ ఫర్ ఓటు కేసు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : క్యాష్ ఫర్ ఓటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరికి వాయిదా వేసింది. 2015 నాటి ఈ కేసులో ఇప్పటి సిఎం రేవంత్ రెడ్డి నిందితుడుగా ఉన్నారు. తనపై ఈ కేసు విచారణ ఎసిబి చేపట్టడాన్ని , ఎసిబి పరిధిని ఆయన సవాలు చేస్తూ తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో దీనిపై రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం పరిశీలించింది. ఈ అంశంపై రేవంత్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషను ఇతర పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. ఈ కేసుకు సంబంధించిన లాయర్లలో ఒక లాయరు కుటుంబ సభ్యుడి మరణం గురించి తెలియచేసుకోవడం జరిగినందున కేసు తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

క్యాష్ ఫర్ ఓటు కేసులో రాష్ట్ర హైకోర్టు 2021 జూన్ 1న ఆదేశాలు వెలువరించింది. ఎసిబి జురిడిక్షన్‌ను ప్రశ్నిస్తూ దాఖలు అయిన పిటిషన్‌ను తోసిపుచ్చడం జరిగింది. ఇప్పుడు ఈ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు పరిధికి చేరింది. కాగా సంబంధిత కేసు వివరాలు 2015 మే 31న జరిగిన పరిణామాలకు సంబంధించినవి. అప్పట్లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పటి శాసన మండలి ఎన్నికలలో టిడిపి అభ్యర్థి వేమా నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నామినేటెడ్ సభ్యులు ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు రేవంత్ రెడ్డి రూ 50 లక్షల మేర ముడుపు ఇచ్చినట్లు అభియోగాలు వెలువడ్డాయి ఈ క్రమంలో రేవంత్‌రెడ్డితో ఆటు కొందరిని రాష్ట్రపరిధిలోని ఎసిబి అరెస్టు చేసింది. తరువాత అందరికీ బెయిల్ మంజూరు అయింది. కాగా 2015 జులైలో ఎసిబి రెడ్డి ఇతరులపై తాజా ఛార్జీషీట్లు దాఖలు చేసింది. అవినీతి నిరోధక చట్టం, ఐపిసిలోని నేరపూరిత కుట్ర చర్య సెక్షన్ 120 బి పరిధిలో అభియోగాలు మోపారు.

ఈ కేసుకు సంబంధించి నిందితుడిపై నేరాల నిర్థారణకు సంబంధించి తమ వద్ద తగు సాక్షాధారాలు ఉన్నాయని ఎసిబి హైకోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించి ఆడియో /వీడియో రికార్డును , పట్టుకున్నట్లుగా చెపుతున్న అడ్వాన్స్ మొత్తం రూ 50 లక్షల నగదును ఇందుకు సాక్షాలుగా పేర్కొంది. దీనిని ప్రాతిపదికగా చేసుకుని అప్పట్లో హైకోర్టు రేవంత్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిని ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News