Sunday, January 26, 2025

మణిపూర్ హింసాకాండపై సిబిఐ కేసుల న్యాయ విచారణ అస్సాంకు బదిలీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసుల విచారణ పొరుగు రాష్ట్రమైన అస్సాంలో జరుగుతుందనిసుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. ఈ కేసుల విచారణ కోసం ఒకరు లేదా మరికొందరు న్యాయాధికారులను నామినేట్ చేయాలని గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నిందితుల హాజరు, రిమాండ్, జుడిషియల్ కస్టడీ, దాని పొడిగింపు వంటి కేసుల విచారణకు సంబంధించిన న్యాయ ప్రక్రియ గువాహటిలో ఏర్పాటు చేసే ప్రత్యేక కోర్టు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆన్‌లైన్‌లో హాజరుకారాదని భావిస్తే బాధితులు, సాక్షులు, సిబిఐ కేసులకు సంబంధించిన ఇతరులు గువాహటి ప్రత్యేక కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరుకావడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

గువాహటి కోర్టులో సిబిఐ కేసుల ఆన్‌లైన్ విచారణకు వీలుగా తగిన ఇంటర్‌నెట్ సర్వీసులను సమకూర్చాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News