Monday, December 23, 2024

కేంద్ర నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు!

- Advertisement -
- Advertisement -
సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల కొట్టివేత

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2016లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న (డిమానిటైజేషన్) నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. న్యాయమూర్తి ఎస్.ఎ. నజీర్ నేతృత్వంలో ఐదుగురు జడ్జీల ధర్మాసనం పెద్ద నోట్ల రద్దు విషయంలో తప్పేమి జరగలేదని, కేంద్ర ప్రభుత్వం, భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ)తో సంప్రదింపులు జరిపే ఆచరణకు దిగిందన్నారు. ఆర్‌బిఐ, ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరిగినందున నాటి ఆ ప్రకటనను కొట్టివేయలేమంది.

‘మూడు ప్రయోజనాలు సరైన ప్రయోజనాలే… లక్షాలు, లక్షాన్ని సాధించే విధానం మధ్య సహేతుకమైన కారణం ఉందని మేము కనుగొన్నాము. దామాషా సిద్ధాంతం ఆధారంగా ఆ చర్యను కొట్టివేయలేము’ అని న్యాయమూర్తి గవాయ్ ప్రకటించారు. పైగా 52 రోజుల గడువును కూడా సరైనదేనని ఆయన అన్నారు. అనుకున్న లక్షాన్ని సాధించారా, లేదా అన్నది అప్రస్తుతం అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం కేంద్రం అధికారం అంశంలో మెజారిటీ తీర్పుతో జస్టిస్ నాగరత్న విభేదించారు. కాగా 2016 నవంబర్ 8న కేంద్రం ప్రకటించిన నోట్ల రద్దు ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. అప్రకటిత ‘నల్లధనం’ లక్షంగా, అవినీతికి వ్యతిరేకంగా చెలామణిలో ఉన్న నగదులో… 86 శాతం చట్టవిరుద్ధం చేయడానికి ప్రధాని మోడీ వ్యక్తిగతంగా దిగ్భ్రాంతికరమైన చర్యను చేపట్టారని అభిప్రాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News