Sunday, January 19, 2025

మాదిగల సంక్షేమం నా బాధ్యత

- Advertisement -
- Advertisement -

ఎస్‌సి వర్గీకరణపై చిత్తశుద్ధితో ఉన్నాం
కావాల్సిన సహకారం అందిస్తాం ఇటీవలి
నామినేటేడ్ పదవుల భర్తీలో సామాజిక న్యాయం
పాటించాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ :ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో, నిబద్ధతతో ముం దుకు సాగుతుందని, దానికి కావాల్సిన స హకారం అందిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏఐసిసి సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే డా.సంపత్ కుమార్, టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ డా. చారకొండ వెంకటేష్‌లు సిఎం రేవంత్‌రెడ్డితో సోమవా రం భేటీ అయ్యారు. వీరు గంటపాటు సిఎం తో పలు అంశాలపై చర్చించారు. అం దులో భా గంగా వందరోజుల పరిపాలనలో ప్రభుత్వంలో నియమించిన అన్ని నియామకాలు, సామాజిక న్యాయంతో కూడుకుందని సిఎం వారితో పేర్కొన్నారు. అతి ముఖ్యంగా మాదిగల అభివృద్ధి, సంక్షేమం, వారి భవిష్యత్ తన బాధ్యత అని సిఎం వారికి హామీనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News