న్యూఢిల్లీ: జరిగే విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సొంతం చానల్ ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తెలిపింది. సొంత వేదిక ఏర్పాట్లు పూర్తయ్యేవరకు యూటూబ్‌ను ఉపయోగిస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడిన ఈ విషయాన్ని తెలిపింది. దేశ ఉన్నత న్యాయస్థానంలో జరిగే విచారణల ప్రసార హక్కులను యూట్యూబ్‌లాంటి ప్రైవేట్ ప్లాట్‌ఫామ్‌లకు ఇవ్వరాదని బిజెపి మాజీ నేత గోవిందాచార్య కౌన్సిల్ వాదించింది. ఈనేపథ్యంలో సుప్రీం చీఫ్ జస్టిస్ యుయు లలిత్, రవీంద్ర భట్, జస్టిస్ పార్ధివాలాతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ సుప్రీంకోర్టు సొంతంగా వేదికను ఏర్పాటు చేయనుందని ప్రసుతం ప్రారంభదశలో ఉన్నాం. తప్పకుండా సొంత వేదికను ఏర్పాటు చేస్తాం. ప్రత్యక్ష ప్రసారాల కాపీరైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం గోవిందాచార్య దాఖలు చేసిన తదుపరి విచారణ అక్టోబర్ 17కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. కాగా రేపటి నుంచి సుప్రీంకోర్టులో జరిగిన విచారణలు యూట్యూబ్‌లో ప్రసారం కానున్నాయి.
SC will have own platform for Live Stream