Tuesday, November 5, 2024

హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోం

- Advertisement -
- Advertisement -

SC won't intervene in High Court order granting bail to student activists

ఢిల్లీ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్తల విడుదలపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు సామాజిక కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై ప్రస్తుతానికి జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ( ఉపా) చట్టంపై హైకోర్టు అభిప్రాయాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని దీనిపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ వి రామసుబ్రమణ్యంలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ బెయిల్ ఉత్తర్వులను ఇప్పుడే పరిశీలించడం అంటే కుదరదు, తర్వాత పరిశీలిస్తాం’ అని బెంచ్ స్పష్టం చేసింది.

గత ఏడాది ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లతో సంబంధం ఉందన్న అరోపణలతో ఢిల్లీ జెఎన్‌యుకు చెందిన 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై కఠినమైన ఉపా చట్టాన్ని మోపారు. కాగా మంగళవారం నటాషా నర్వాల్, దేవాంగన కలిత, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే చిరునామాల ధ్రువీకరణ, విధానపరమైన అడ్డంకుల కారణంగా వారిని గురువారం వరకు విడుదల చేయలేదు. దీంతో ఈ విషయమై గురువారం కూడా స్పందించిన హైకోర్టు వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే వీరి విడుదలను సవాలు చేస్తూ ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News