ఎల్‌పిజీ ఆటోల కొనుగోళ్లలో దోపిడీ జరుగుతోంది. ఎల్‌పిజి (లిక్విడ్ పెట్రోలియం గ్యా స్) ఆటోలు త్వరలోనే బ్యాన్ చేస్తున్నారన్న పుకార్ల నేపథ్యంలో ఆటోలను విక్రయించే డీలర్‌లు కొన్ని జిల్లాల్లో ఒక్కో ఆటోకు అధికంగా (ఇన్‌వాయిస్ ఇవ్వకుం డా) వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. ఇక సిఎన్‌జి ఆటోల కొ నుగోళ్లకు సంబంధించి సుమారుగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అధికంగా చెల్లించాల్సి వస్తుందని ఆటో డ్రైవర్‌లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఆటోల కొనుగోళ్లపై నిషేధం ఉండడంతో డీలర్‌లకు, రవాణా శాఖ అధికారులకు ఇది వరంగా మారిందని ఆటోడ్రైవర్‌లు వాపోతున్నారు.
అయితే గ్రేటర్ పరిధికి ఆనుకొని ఉన్న కొన్ని జిల్లాలో ఆటోల కొనుగోళ్లతో పాటు వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఒక్కో ఆటో కు సుమారుగా రూ.10 నుంచి రూ.12 వే లు అధికంగా రవాణా శాఖ అధికారులకు చెల్లించాల్సి వస్తుందని, దీంతో తమకు ఒక్క ఆటోకు జిల్లాల్లో సుమారుగా రూ.3 లక్షల పైచిలుకు ఖర్చు వస్తుందని, గ్రేటర్ పరిధిలో అయితే పాత ఆటోను తుక్కుగా మార్చిన త రువాత కొత్త ఆటోను కొనుగోలు చేయాలం టే సుమారుగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డీలర్లకు అధికంగా చెల్లించాల్సి వస్తుందని ఆటోడ్రైవర్‌లు, యూనియన్ నా యకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దళారీ పాత్రలో ఫైనాన్షియర్
వీరితో పాటు ఆటో ఫైనాన్షియర్‌ల ఆగడా లు ఎక్కువయ్యాయని, ప్రస్తుతం ఆటో కొనుగోళ్ల దందా ఫైనాన్షియర్లకు వరంగా మా రిందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం గ్రే టర్ పరిధిలో సిఎన్‌జి, ఎల్‌పిజి కొత్త ఆటోల కొనుగోళ్లపై నిషేధం ఉండడంతో ఫైనాన్స్‌దారులే దళారుల పాత్రను పోషిస్తున్నారని వారే జిల్లాల్లో ఉన్న డీలర్‌లతో మాట్లాడి ఆటోలను ఇప్పిస్తున్నారని పలువురు ఆటోల డ్రైవర్‌లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 80 లక్షల వాహనాలు ఉండగా, ఇందులో 40 లక్షల వరకు ద్విచక్రవాహనాలు, లక్ష వరకు ఆటోలు ఉన్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో పాత ఆటోను స్క్రాప్ చేస్తే మనకు రవాణా శాఖ అధికారులు ప్రోసిడింగ్ ఇస్తారు. ఆ ప్రోసీడింగ్‌ను తీసుకెళితే డీలర్ మనకు కొత్త ఆటోను ఇస్తారు. మాములుగా సిఎన్‌జీ ఆటో ఇన్‌వాయిస్‌కు రూ.2 లక్షల 30 వేలు అవుతోంది.
కానీ, ఇక్కడే ఫైనాన్షియర్ తన తెలివిని వాడి ఆటోపై సుమారు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఫైనాన్స్ చేస్తాడు. అనంతరం అక్కడి నుంచి ఆటో కొనుగోలు కోసం డీలర్ దగ్గరకు వెళితే అక్కడ ఆటో ధర రూ.5లక్షల 60 వేలుగా డీలర్ పేర్కొంటారు. ఫైనాన్స్ పోనూ ఆటో కొనుగోలు చేసే వ్యక్తి మిగతా డబ్బులను డీలర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, డీలర్ ఆటో ఇచ్చే ముందు ఇన్‌వాయిస్ మాత్రం రూ.2 లక్షల 30 వేలకే ఇస్తారు. మిగతా డబ్బులకు రశీదు ఇవ్వకుండా ఆటోను ఇస్తారు. మాములుగా ఒక ఆటో కొనాలంటే రూ.2 లక్షలను 60 వేలను చెల్లిస్తే సరిపోతుంది. కానీ, మిగతా రూ.3 లక్షలను రవాణా శాఖ అధికారులు, డీలర్‌లు, ఫైనాన్షియర్‌లు వాటాలు చేసుకుంటున్నారని ఆటో యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.
సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, నల్లగొండ జిల్లాలో రిజిస్ట్రేషన్ కోసం
సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, నల్లగొండ జిల్లాలో రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్‌ల కోసం భారీగా ముడుపులు తీసుకుంటున్నారని దీంతో తమకు తడిసిమోపెడు అవుతుందని ఆటోడ్రైవర్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2002 నుంచి ఆటోల కొనుగోళ్లపై నిషేధం
2002లో కేంద్ర ప్రభుత్వ నియమించిన బూరేలాల్ కమిటీ గ్రేటర్ పరిధిలో ఆటోల కొనుగోళ్లను నిషేధించడంతో ఈ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆటోడ్రైవర్‌లు వాపోతున్నారు. గ్రేటర్ పరిధిలో కొత్త ఆటోల కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో ఆటోలను కొనుగోలు చేయాలనుకునే వారి పర్మిట్ పేరుతో రూ. 2.50 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆటోడ్రైవర్ యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఆటో పర్మిట్ ఉంటే కొత్త ఆటోలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన ఆటో స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా స్క్రాప్ చేసిన ఆటోలకు సంబంధించిన వివరాలతో కొత్త ఆటోలకు అనుమతి (పర్మిట్ ) పొందాల్సి ఉంటుంది. ఈ విధంగా పర్మిట్ కోసమే పెద్ద మొత్తంలో సమర్పించాల్సి వస్తోందని యూనియన్ నాయకులు వాపోతున్నారు. ఇక షోరూంల్లో ఆటో రిక్షా ధర రూ.2 లక్షల 50 వేలు ఉంటే ఎవరైనా కొత్తగా ఆటో రిక్షా కొనుగోలు కోసం వెళితే పర్మిట్‌తో కలిపి ఒక్క ఆటోకు రూ.5 లక్షలకు పైగానే చెల్లించాల్సి రావడం గమనార్హం.
రవాణా శాఖ అధికారులు, డీలర్‌ల వల్లే బ్లాక్‌మార్కెట్ దందా….
గ్రేటర్ హైదరాబాద్ ఆటోరిక్షా అండ్ వర్కర్స్, ఐఎన్‌టియూసి అధ్యక్షుడు దయానంద్
రవాణా శాఖ అధికారులు, డీలర్‌ల వల్లే బ్లాక్‌మార్కెట్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లాలోనూ ఆటోల రిజిస్ట్రేషన్‌ల కోసం రవాణా శాఖ అధికారులు భారీగా ముడపులు తీసుకుంటున్నారు. సాధారణంగా వాహనాల ధరలు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఒకే ధర ఉంటాయి. కానీ, ఇందుకు భిన్నంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కొనుగోలు ఆటోల ధరల విషయంలో లక్షల్లో తేడా ఉంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆటోల కొనుగోళ్లపై నిషేధం ఉండడంతో రవాణా శాఖ అధికారులతో పాటు డీలర్లు, ఫైనాన్షియర్‌లకు ఇది ఒక వరంగా మారింది. వేరే జిల్లాలో కొత్త ఆటో ఖరీదు సుమారు రూ. 2.50 లక్షలు ఉండగా అదే ఆటోను హైదరాబాద్ పరిధిలో కోనుగోలు చేయాలంటే రూ. 5 లక్షల 60 వేలను ఖర్చు చేయాల్సి వస్తోంది.