Thursday, January 23, 2025

పక్కా ప్లాన్ ప్రకారమే స్కామ్ జరిగింది: కన్నబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: యువతకు శిక్షణ పేరుతో దోచుకున్నారని వైసిపి ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్కిల్ స్కామ్‌పై చర్చ జరిగింది. ఈ సందర్బంగా కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఆగమేఘాలపై పనులు మొదలు పెట్టారని, డబ్బులను రకరకాల అకౌంట్లకు మళ్లించారని దుయ్యబట్టారు. అనేక కంపెనీలకు రిజిస్టర్ చేయించారని, పక్కా ప్లాన్ ప్రకారమే స్కామ్ జరిగిందని, అప్పుడే కేబినెట్‌ను చంద్రబాబు తప్పుదారి పట్టించారని, చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారని కన్నబాబు విమర్శించారు. అరెస్ట్ రోజున హెలికాప్టర్‌ను బాబు కావాలనే వద్దన్నారని, రోడ్డు మార్గాన వెళ్తే సానుభూతి వస్తుందనుకున్నారని పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ అంత గొప్ప నాయకుడిలా చంద్రబాబు ఫోజులిస్తున్నారని, చంద్రబాబు అవినీతిని ఐటి బట్టబయలు చేసిందని, బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించడంలో యోగేష్ గుప్తా దిట్ట అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. టన్నుల పేరుతో కోడ్ లాంగ్వేజ్‌లో అవినీతికి పాల్పడినట్టు గుర్తించారు. టన్నుల అంటే బరువు కాదని, కోట్లు అనే అర్థం వచ్చేలా కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించారని దుయ్యబట్టారు.

Also Read: కెనడా పౌరులకు వీసాలు బంద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News