Thursday, January 23, 2025

త్వరలో సెట్ల షెడ్యూల్?

- Advertisement -
- Advertisement -

Schedule of entrance exams will be released soon

రెండు, మూడ్రోజుల్లో విడుదలయ్యే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే ఎంసెట్, ఇసెట్ షెడ్యూల్ విడుదల కాగా, రెండు మూడు రోజుల్లో మిగతా ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వెలువడనుంది. ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్ష జులై 18, 19, 20 తేదీల్లో నిర్వహించనుండగా, పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఇసెట్ జులై 13న జరుగనుంది. ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పిజిఇసెట్, పిఇసెట్ తదితర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఆయా సెట్లకు కన్వీనర్లుగా నియమించగా, రెండు మూడు రోజుల్లో పరీక్షల తేదీలు ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

ఎంసెట్‌కు పెరుగనున్న విద్యార్థులు

ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఇంటర్‌కు ప్రమోట్ చేశారు. దాంతో టెన్త్ పాసైన విద్యార్థుల్లో మెజారిటీ విద్యార్థులు ఇంటర్మీడియేట్‌లోనే చేరారు. అందులో ఎంపిసి, బైపిసి గ్రూపుల్లోనే ఎక్కువ మంది చేరారు. ప్రస్తుతం ఈ విద్యార్థులందరూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించగా, అందులో కేవలం 49 శాతం విద్యార్థులే ఉత్తీర్ణత సాధించారు. తర్వాత అందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఎలా ఉన్నా,సైన్స్ గ్రూపుల విద్యార్థుల్లో సుమారు 90 శాతం వరకు ఎంసెట్ రాసే అవకాశం ఉంది. దీంతో గతం కన్నా ఈసారి ఎంసెట్ రాసే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News