Thursday, January 23, 2025

9న షెడ్యూల్?

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల కసరత్తును వేగవంతం చేసిన ఇసి

న్యూఢిల్లీ: తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన షె డ్యూల్ ఈ నెల 8-10 తేదీల మధ్య వెలువడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయి తే ఈ నెల 9న కచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ వి డుదలయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఎన్నికల సంఘం శుక్రవారం భేటీ అయింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా రాష్ట్రా ల్లో సమీక్షలు నిర్వహించిన ఇసి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక అంచనాకు వచ్చినట్లు తె లుస్తోంది.

తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇటీవల మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని, చత్తీస్‌గఢ్‌లో రెండు విడతలుగా పోలింగ్ ని ర్వహించాలని ఎన్నికల సంఘం బావిస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణతో పాటుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలలోఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఇసి భావిస్తోంది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమయిన చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని భావిస్తోంది.

పోలింగ్ ప్రక్రియ నవంబర్ రెండో వారంనుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కాగా డిసెంబర్ 10-15 తేదీల మధ్య ఓ ట్ల లెక్కింపు జరపాలని ఇసి భావిస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియనుండగా, మిజోరీం శాసన సభ పదవీ కాలం ఈఏడాది డిసెంబర్ 17తో ముగుస్తుంది. మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉం డగా, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ, మధ్యప్రదేశ్‌లో బిజెపి అధికారంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధికారంలో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News