Sunday, January 19, 2025

పథకాలు అద్భుతం…పదవుల్లో ప్రాతినిధ్యమివ్వండి

- Advertisement -
- Advertisement -

మంత్రి పొన్నంకు దాసు సురేశ్ వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం 17 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయటంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకంగా వ్యవహరించారని బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ అన్నారు. దాసు సురేశ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఘనంగా సన్మానించారు.. ఇటీవల ప్రకటించిన 37 జనరల్ కార్పోరేషన్‌లలోనూ 13 కార్పొరషన్లకు చైర్మన్లుగా బిసిలను ప్రకటించడంపై ప్రభుత్వాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా దాసు సురేశ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి రిజర్వేషన్లను గత ప్రభుత్వం గణనీయంగా తగ్గించడంతో బిసిల నాయకత్వం అణగదొక్కబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో బిసిల నాయకత్వ ఎదుగుదలకు కొత్త కార్పొరేషన్లను ఏర్పాటుచేసి పాలక మండళ్లను ఏర్పాటుచేయాలని గతంల అనేక పోరాటాలు చేసి తాము అరెస్టులపాలైనా సాధ్యంకాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నేడు శీఘ్రగతిన 100 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అది సాధ్యమయ్యిందని కొనియాడారు. అందుకు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.

బిసి సమస్యలను నివేదించిన వెంటనే బిసిల ఆర్థిక అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.8 వేల కోట్లు కేటాయించటం, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ గురుకులాలకు సమీకృత స్వంత భవనాలను ఏర్పాటు చేయటం, 100 రోజుల పాలనలో నిరుద్యోగులకు 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయడం, ఉపాధ్యాయ నియామకాలకోసం టెట్ ను నిర్వహించడం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ,రూ. 500 లకే గ్యాస్ సిలెండర్ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తదితర అంశాలపై ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలబడి పనులను శీగ్రగతిన పూర్తిచేయడం పట్ల బిసిల తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

గత ప్రభుత్వ పదేళ్ళ కాలంలో ప్రజా పోరాటాల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలచిన ప్రజాఉద్యమ సంఘాలు, సివిల్ సొసైటీ నాయకులకు సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమానంగా ప్రాధాన్యతకలిగిన నామినేటెడ్ పదవులలో అవకాశాలు ఇవ్వాలని మంత్రికి విన్నవించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సామజిక న్యాయం కోసం పోరాటం చేస్తుండగా తెలంగాణలో మాత్రం పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికే పరిమితం అవుతున్నాయని దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంతి రేవంత్ రెడ్డి ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని బిసిల నాయకత్వపు ఎదుగుదలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షులు దొంత ఆనందం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తులసీ శ్రీమన్ ,మహిళా కన్వీనర్ బోనం ఊర్మిళ , రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ స్వామి, రాష్ట్ర కార్యదర్శి వీరాస్వామి యాదవ్ , మీడియా సెక్రటరీ మారేపల్లి లక్ష్మణ్ , బిసి రాజ్యాధికార సమితి వ్యవస్థాపక సభ్యురాలు దోనేటి కృష్ణలత, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పద్మావతి, ప్రధాన కార్యదర్శి గోషిక స్వప్న, సెక్రటరీ లక్ష్మీ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కాలసముద్రం సుధాకర్ , రాష్ట్ర కార్యదర్శి పెండెం నాగభూషణం,వెంకట్ యాదవ్ ,సుధాకర్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యలు పొదిల రాజు ,యూత్ కమిటీ జనరల్ సెక్రటరీ మడత కిషోర్ , దామెరకొండ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News