Monday, December 23, 2024

బిసిల అభ్యున్నతి సిఎం కెసిఆర్‌తోనే సాధ్యం : జూలూరు గౌరీ శంకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బీసీల అభ్యున్నతి సిఎం కెసిఆర్‌తోనే సాధ్యమని, వారి కోసం ఇంతగా చేసిన ముఖ్యమంత్రి దేశంలోనే మరొకరు లేరని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ పేర్కొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆదివాసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని ఆయన అన్నారు. తెలంగాణ ఇప్పుడు సంక్షేమానికి చిరునామా గా నిలిచిందని, బీసీల కోసం కేటాయించిన ఆత్మగౌరవ భవనాలు దేశంలో మరెక్కడా లేవు అవి వారి భవిష్యత్తుకు పరిశోధనాలయాలుగా నిలుస్తాయని

ఆయన శుక్రవారం నాడొక ప్రకటనలో పేర్కొన్నారు.దళిత బంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని, దేశమంతాదళిత బంధు పథకాలు అమలు జరగాలని అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే అంబేద్కర్ ఆశయాలను అమలు జరుపుతున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. తెలంగాణలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని జూలూరు గౌరీ శంకర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News