Thursday, January 23, 2025

దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలు

- Advertisement -
- Advertisement -
  • గులాబీ దండులో భారీ చేరికలు

పెద్దపల్లి ప్రతినిధి: దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 29న వార్డులో ముస్లీం మైనారిటీ నాయకలు జహీర్ భారీ సంఖ్యలో యువకులు, మహిళలతో కలిసి గులాబీ దండులో చేరారు.

కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, దళితబంధు, మైనారిటీ బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్టు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్పాహారం లాంటి ఎన్నో పథకాలు తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. గత పాలకుల హయాంలో నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదని గత 9 ఏళ్లలో 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపామన్నారు.

సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిందని, పట్టణంలో రహదారులను విస్తరించడంతోపాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మిని ట్యాంక్‌బండ్‌ను అద్భుతంగా నిర్మించుకున్నామని, బోటు సౌకర్యం కూడా అందబాటులోకి తెచ్చామన్నారు. అధికారంలోకి రాగానే తెల్ల రేషన్‌కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం, ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. రైతుబంధు రూ.16 వేలు, ఆసరా పింఛన్లు రూ.5 వేలు, వికలాంగులకు రూ.6 వేలు పెంచుతామన్నారు. గత పాలకులు కేవలం మైనారిటీలను ఓటర్లుగానే చూశారని, తమ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి లక్షలాది రూపాయల ఖర్చు పెట్టారన్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగిరేలా ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమత ప్రశాంత్‌రెడ్డి, ఇల్లందుల కృష్ణమూర్తి, సరేష్, మోబిన్, పెంచాల శ్రీధర్, పైడ రవి, తబ్రీజ్, ఖదీర్, అవునూరి రవి, కుంభం సంతోష్, జంబు భాయ్, జావేద్, అజీజ్, వెన్నం రవి, అఖిల్, నిఖిల్‌తోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News