Monday, December 23, 2024

చేవెళ్లలో లారీ చక్రాల కింద నలిగి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

 

రంగారెడ్డి: వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొనడంతో ఎనిమిదేళ్ల పాఠశాల విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హృదయ విదారకమైన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గొల్లపల్లిలో బస్సు కోసం ఎదురు చూస్తున్న పాఠశాలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులను వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొని ఇంటిపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో లారీ చక్రాల కింద నలిగి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News