Monday, December 23, 2024

భారీ వర్షానికి కూలిన పాఠశాల భవనం

- Advertisement -
- Advertisement -

యాలాల: మంగళవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి యాలాల మండల పరిధిలోని రేళ్ళగడ్డతాండా గ్రామ పంచాయతీలోని ప్రాథమిక పాఠశాల భవనం ముందు భాగంలోని సజ్జ కూలి పోయింది. అంతేకాదు పాఠశాల వెనకాల గల కిటికీల పైన ఉన్న సజ్జ సైతం కూలి పోగా భవనంలోని స్లాబ్ ద్వారా సైతం నీరు కారడం మొదలైనది. దీంతో పాఠశాల వెనక భాగంలోని కుడి వైపున గల పిల్లర్ కూడా కూలడానికి సిద్ధంగా ఉంది. గ్రామస్తులు ఉదయం ఈ పాఠశాల భవనాన్ని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాల భవనంలోకి పంపేందుకు భయభ్రాంతులకు లోన వుతున్నారు. ఉదయం పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు వచ్చి చూడగా ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటాన్ని గమనించి ఈ పాఠశాల భవనం 2002లో నిర్మించడం జరిగినందున రాత్రి వేళ కురిసిన భారీ వర్షం కారణంగా పాఠశాల చుటూ ఉన్న సజ్జలన్నీ కూలిపోయి చివరికి పాఠశాల భవనమే కూలడానికి తయారైందని,

గ్రామస్తుల విద్యార్థుల తల్లిదండ్రల లో కలిసి మాట్లాడి గత రెండు సంవత్సరాలకు ముందు అప్పటి గ్రామ సర్పంచ్ శంకర్‌నాయక్ కూలేందుకు సిద్ధంగా ఉన్న పాఠశాల భవనం ముందు నూతన పాఠశాల భవనాన్ని రూ. 5 లక్షలతో నిర్మించగా ఆ భవనానికి సంబంధించిన డబ్బులు రాలేదని, ఈ విషయం మీ అందరికి తెలిసిన విషయమే ఐనందునా ఆయన కుటుంబ సభ్యలకు అడికి ఆ నూతన భవనాన్ని విధ్యార్థుల కోసం అడిగి తీసుకుంటే ప్రస్తుతం విద్యార్థులు కూర్చొని చదువుకునేందుకు ఉపయోగపడుతు ందని తెలుపగా గ్రామస్తుల విద్యార్థుల తల్లి దండ్రులు శంకర్‌నాయక్ కుటుంబ సభ్యులకు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అడిగి మీ డబ్బులు ఇప్పించే విదంగా కృషి చేస్తామని నచ్చజెప్పి నూతన భవన గదిని గ్రామ విద్యార్థులకు ఇప్పించారు. అయితే ఈ గ్రామంలోని పాఠశాలలో 63 మంది విద్యార్థులు చదువుతుండగా 1 నుంచి 5 వ తరగతుల వరకు కొనసాగుతున్నాయి.

ఈ విద్యార్థుల కోసం తక్ష ణం మరో తరగతి గది నిర్మాణానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల నిధులను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరి నిధులు తెచ్చి కొత్త పాఠశాలను నిర్మించే విధంగా కృషి చేస్తామని గ్రామ బిఆర్‌ఎస్ నాయకులు పేర్కొనారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News