Saturday, December 21, 2024

ప్రమాదంలో పాఠశాల భవనం

- Advertisement -
- Advertisement -

పెంట్లవెల్లి : పెచ్చులూడిపోతున్న పైకప్పు, వర్షం వస్తే కారిపోతున్న భవనం, ఆరుబయట నిలిచిపోతున్న నీరు, ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల్లో భయం ఇది పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు కోట ప్రాథమిక పాఠశాల దుస్థితి. మన ఊరు మన బడి పథకంలో విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నా కోట పాఠశాలను మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఈ పాఠశాలలో అంగన్వాడి కేంద్రంతో కలిసి 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. మూడు గదుల ఈ పాఠశాల భవనం శ్లాబ్ పెచ్చులూడి పడి పోతున్నాయి. పిల్లలు గాయాలపాలవుతారేమోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షం వస్తే భవనం కారిపోతుంది. భవనం గోడలు నానిపోతున్నాయి. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సదుపాయం లేకపోవడంతో నీరంతా స్కూల్ ఆవరణలో నిలిచి పోతుంది.

దీనికి తోడు సగానికి పైగా ప్రహారి దెబ్బతినడంతో పశువులు, కుక్కలు, పందులు పాఠశాల ఆవరణలో సంచరించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాల మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News