Sunday, December 22, 2024

డ్రైవర్‌కు మూర్ఛ…. ఐదు కార్లను ఢీకొట్టిన స్కూల్ బస్సు

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కూల్ బస్సు డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో వాహనం అదుపు తప్పి ఐదు కార్లను ఢీకొట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రాకరం… ఓ ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులను ఇంటి దగ్గర దింపి తిరిగి అయ్యప్పగుడి నుంచి మినీ బైపాస్ రోడ్డులోని ఫ్లైఓవర్ మీదుగా వెళ్తుండగా డ్రైవర్‌కు మూర్ఛ వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పి ముందున్న ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు వాహనంలో ఉన్న మహిళా గాయపడ్డారు. వెంటనే ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News