Monday, January 20, 2025

స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం

- Advertisement -
- Advertisement -

లారీని ఢీకొన్న బస్సు.. 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు

మన తెలంగాణ/రెబ్బన: ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బన మండల కేంద్రంలోని అన్నపూర్ణ హై స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్షంతో ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం స్కూల్ తరగతుల సమయం ముగిసిన తరువాత 35 మంది పిల్లలతో బయలుదేరిన బస్సు ఇందిరానగర్ వద్ద కొంతమందిని దింపింది. అనంతరం జాతీయ రహదారిపై రాంగ్ రూటులో వెళ్తున్న క్రమంలో స్కూల్ బస్సును ఆ సిఫాబాద్ నుంచి రెబ్బన వస్తున్న లారీ ఢీకొట్టడం తో ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… స్కూల్ బస్సు డ్రైవర్ ఇందిరానగర్‌లో స్కూల్ పిల్లలను యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉండగా రాంగ్ రూట్‌లో వెళ్లడంతో లారీ బస్సును ఢీకొట్టినట్లు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 15మంది పిల్లలు తీవ్ర గాయాలు కాగా వారిని కాగజ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. స్కూల్ బస్సు డ్రైవర్ రెండు కాళ్లు విరగడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News