Monday, December 23, 2024

డ్రైవింగ్ చేస్తూ గుండెపోటు.. 40 మంది విద్యార్థులను కాపాడిన డ్రైవర్

- Advertisement -
- Advertisement -

అమరావతి: పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో 40 మంది విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. 53 ఏళ్ల గుర్రాల ఏడుకొండలు అనే డ్రైవర్ బస్సును మైలవరం, ఉప్పలపాడు, వెంపర గ్రామాల మీదుగా అద్దంకి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలకు నడుపుతుండగా ఈ ఘటన జరిగిందని విద్యార్థులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలపాడు నుంచి వెళ్లగానే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. కానీ, అతను అపస్మారక స్థితికి చేరుకోకముందే, సెకను వ్యవధిలో, అతను వాహనాన్ని ఆపి పెను ప్రమాదాన్ని తప్పించాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్ పాఠశాలకు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News