Tuesday, December 3, 2024

మార్ఫింగ్ ఫొటోలతో బెదిరించి… విద్యార్థినిపై స్కూల్ బస్సు డ్రైవర్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: 12వ తరగతి విద్యార్థినిపై స్కూల్ బస్సు డ్రైవర్ పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన పంజాబ్ రాష్ట్రం మోహాలీలోని జిరాక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముహ్మద్ రజాక్ అనే వ్యక్తి ఓ స్కూల్‌ బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నారు.  అదే స్కూళ్లో 12 వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికను పలుమార్లు లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆమెను రజాక్ లొంగదీసుకున్నాడు. పలుమార్లు బాలికపై బస్సు డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోస్కో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News